మార్పు మంచిదే...

Posted by చంద్రం on 9/29/2011 06:54:00 AM
        ప్పుడైనా మనకి గానీ తిక్కరేగిందంటే (తిడితే పడటానికెవరూ దొరకనప్పుడు) కాలాన్ని తిట్టేస్తాం. కాసేపయ్యాక..."కాలం బా..గా చెడిపోయిందనో, మారిపోయిందనో" తేల్చేసి, బెంగపడిపోతాం.

        నిజమే...! 

        అందులో అర్థం ఉంది. మన పక్కన ఉన్న వాళ్లు కూడా అవుననే అనాలి తప్పా, కాదనకూడదు. అంత నిజం అది. ఇంతకీ ఏం మారిందని మనం దిగులు పడిపోతున్నట్టూ?

       అబ్బే...!

       ఏది మారలేదు కనక? 

       సర్వం మారిపోయింది. మన ఇంట్లో పేపరేసే కుర్రాడితో సహా ప్రపంచమే మారిపోయింది.ప్రపంచం అంటే గుర్తుకొచ్చిందీ, ఈ మద్య అమెరికా కూడా బాగా మారిందంట. దాంతో  మా ఇంటిఓనరు కూడా చాలా మారిపోయాడు. అదేంటంటే, అక్కడ అమెరికాలో వాళ్ల అబ్బాయి మారిపోయాడంట. భూమి ఎంత గుండ్రంగా ఉందోననిపించింది.

        ఐనా, మార్పు మంచిదేగా? అలా అనుకునే కదా, ఇన్నాళ్లూ ఎన్నో మార్పులని పంటిబిగివున ఓర్చుకుంటూ వొస్తున్నాం. ఇంతకుముందు పెళ్లవగానే ఉద్యోగంలో చేరితే, పళ్లూడేదాకా అదేఉద్యోగం చేసి, రిటైరయ్యేవాళ్లం. ఇప్పుడలా కుదురుద్దా? ఊహూ! పది కోర్సులైనా చేయాలి. కనీసం పది సాప్ట్ వేర్ లైనా నేర్చుకోవాలి. అంతాచేసి పెళ్లికి ముందు ఉద్యోగంలో చేరితే, కనీసం పెళ్లయ్యేదాకానైనా అది ఉంటుందో, లేదో చెప్పలేం. ఏమంటే...సవాలక్ష మార్పులొస్తుంటాయ్...! 

        ఒకటి నిజం..! ఎక్కడైనా ఒక మార్పు జరిగిందంటే అది ఇంకెక్కడో ఇంకోదేన్నో మార్చి తీరుతుంది. మనం మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారట్లే? అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్లీ మనం సహజంగానే మారిపోతాం కదా? 

        అంత దాకా ఎందుకూ? చిన్నప్పుడు మన ఇళ్లమీద ఊరపిచ్చుకలు
వాలి, కిచకిచలాడేవా లేదా? అలాంటిది ఈ తరం పిల్లలకి ఊరపిచ్చుక లంటేనే తెలీనంత మార్పు! అసలీ ఊరపిచ్చుకలు మాయం కావటానికీ గ్లోబలైజేషన్ కీ ఏదైనా సంబంధం ఉందా? ఉండే ఉంటుంది. ఐనా, పిచ్చుకల గురించి అలోచించే తీరిక మనకి లేదు కానీ, అవి మాత్రం ఊరకే ఎందుకు మారిపోతాయి? ఏదో తేడా వొచ్చేఉంటుంది.

        ప్రపంచీకరణ  వలన ప్రపంచమే ఒక ఇల్లులా మారిపోతుందంటే నిజమేననుకుని హడావుడి పడ్డాం. నిజమే! టీవీలూ, సెల్ ఫోన్ లూ, ఇంటర్నెట్టూ... ఎంత మార్పు? ఇంతకు ముందు ఇళ్లకి ముందు అరుగులుండేవి. చక్కగా కూచుని, దారినపోయే వాళ్లని పలకరిస్తూ మంచీ,చెడూ మాట్లాడుకునే వాళ్లు.

        ఇప్పుడలా కుదురుతుందా? 

        ఒకటి, అలాంటి ఇళ్లు కట్టుకోవడం కుదరదు...రెండు..అంత తీరిగ్గా కూచోడం అంతకన్నా  కుదరదు. ఎందుకంటే, మళ్లీ ఎన్నో మార్పులు.ఎక్కడ మార్పు వొచ్చేసిందో కూడా తెలీనంత మార్పు. ప్రపంచం ఒక ఇల్లులా మారిందని సంతోషించాలే తప్ప, 
ఎలాంటి ఇల్లు ఎలా మారిపోయిందని ఆలోచించకూడదు. సినిమాకి వెళ్లొచ్చేంత వేగంగా పెళ్లి చేసుకోగలమా లేదా? కలిసున్నామో, విడిపోతున్నామో కూడా అర్థం కానంత వేగంగా పరుగెడుతున్నామా లేదా? కళ్లు మూసి, తెరిసేలోగా ఇల్లు కట్టేస్తున్నామా లేదా, బిజినెస్ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఫర్లేదు, పరుగెట్టొచ్చు. కానీ, ఎందుకు పరుగెట్టాలీ? మనకన్నా ముందు తరాలు హాయిగా నడుస్తూనే చక్కగా బ్రతికారు కదా? అన్నీ సాధించారు కదా? అన్నీ అస్వాదించారు కదా? మనకే ఏమయ్యిందీ?  

        మళ్లీ మార్పు..! గుండె కొట్టుకుంటోదో లేదో కూడా పట్టించుకోలేనంత మార్పు..! 

        స్థూలంగా చూస్తే ప్రపంచం మారినట్టు కనిపించినా, ఆలోచిస్తే మారింది మనమేనని ఎవరికైనా అర్థమవుతుంది.

        మార్పు సహజం..! 

        నిజమే...! 

        ఆ మార్పు సహజంగా జరిగితేనే అది మనిషి జీవితాన్ని మరింత సరళంగా మారుస్తుంది. అసహజంగా జరిగే ఏ మార్పు ఐనా సంక్లిష్ఠతకు, అశాంతికీ దారి తీస్తుందే తప్ప, మేలు చేయదు. మనం ఇలా అయోమయంతో కంగారు పడతామేమోననే "మనిషి జీవితాన్ని సరళం చేసేదే శాస్త్రమైనా, మరేదైనా" అని పెద్దలెప్పుడో ఖరాఖండిగా చెప్పారు.

        మనం తెగ ఫీలై పోతుంటాం కానీ, శాస్త్రాలు ఇదేం పట్టించుకున్న దాఖలా కనిపించదు. ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్ అని ఒక విభాగం ఉంది. అందులో ఒక సూత్రం ఉంటుంది...Entropy గురించి...
! 

        అదేంటంటే...

        "The whole universe is traveling towards an entropy" అని.

        ఎంట్రొపీ అంటే ఒక రకమైన disorder.

        ఒక నియమానికీ, పద్దతికి లొంగకుండా...క్రమం లేకుండా ఉండటం...! ఇది అర్థం చేసుకోవడానికి  ఎన్నో ఉదహరణలు చెప్పుకోవచ్చు. అందరికీ  అర్థం కావాలంటే...స్కూల్ కి వె
ళ్లేటప్పుడు అయిష్ఠంగా, భారంగా వెళ్లే పిల్లలు స్కూల్ నించి ఇంటికి రావటానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపించడం లాంటిదే ఇది కూడా. విశ్రుంఖలతలో ఉండే ఆనందం! అనైతికతలో ఉండే పారవశ్యం! సహజంగానే మనని అన్ని నియమాలనీ ఉల్లంగించేటట్టు చేస్తుంది.

        పర్యవసానం...మనం చూస్తున్నదే...! వినాశనం!!  

        అది అర్థం చేసుకోగలిగితే, నిజమే అని ఒప్పుకుని తీరుతాం. మనిషి గానీ, ప్రకృతిలో ఉండే ఏ వస్తువూ, పదార్థం గానీ, (ప్లాస్టిక్ లాంటివి కొంచెం మొండికేసినా) చివరికి విశ్వం కూడా కాలంతోపాటూ ఒక్కో దశలో క్షీణించిపోతాయి...! స..హ..జం..గా!

        దురదృష్ఠకరమైన విషయమేంటంటే, విశ్వంలో అన్నిటికన్నా త్వరగా క్షీణించేది మన మనసేనేమో! మనిషి స్వభావమే అంతకదా. మనం మారి పోయాం కాబట్టే ప్రపంచం ఇలా మారిందని అనుకోం కదా! చిన్నదైనా, పెద్దదైనా తప్పు చేయడానికి, విలువల్ని వొదులుకోవటానికి తహ తహలాడినట్టు...కారణాలు వెదుక్కున్నట్టు, నియమంగా ఉండటానికి ఇష్ఠపడతామా? కావలిస్తే, తప్పు చేయక తప్పదన్నట్టు, మనకున్న అపారమైన (లోక)జ్ఞానంతో తప్పొప్పుల అర్థాలని మార్చేసుకుంటాం గానీ...కనిపించకుండా పోయిన ఊరపిచ్చుకల గురించి మనం  మారడమేంటీ?

        నో..నాస్టాల్జియా..!

        నో నాన్సెన్స్...!



- చంద్రం



                                     

సరిహద్దు లోపల యుద్దం

Posted by చంద్రం on 9/28/2011 01:48:00 AM
            ఎప్పటిలాగే పట్టు
 వదలని విక్రమార్కుల్లా మనమంతా పగలంతా పనికిమాలిన పనులన్నీ చేసీ,చేసీ నాగరికత చిమ్ముతున్న విషపు ఆవిర్లు పీల్చీ, పీల్చీ సాయంత్రానికి ట్రాఫిక్ జాముల్లో అలసీ సొలసీ సత్తువ సన్నగిల్లిపోయి కొంపకిచేరి, పెళ్లాం పెట్టిందేదో తిని, టీవీలో తలదూర్చి, నిశ్చింతగా బజ్జున్నాకా...మనకిక ఏ భయమూ లేదన్న బ్రాంతిలో సహజంగానే నిద్దరొస్తుంది. నిద్దట్లో కూడా బాస్ కోపమో, భయంకరమైన అప్పులో తప్ప మనకి ఎన్నడూ 'ఇంకో' కల రాదు.
 
త్వరలో...

My Life In 7 Colors

Posted by చంద్రం on 9/26/2011 05:55:00 PM

                                          I am exited to announce the making of a short film 
                                                        My life in 7 colors
                                We have started it way back and now it is completing the 
                                post production work. I must say few words about producer and 
                                director Dasari Srinivas, who has gone to every extent to get
                                the short film completed. He has taken every care to attain even
                                minute details in the film. It is his passion that can be seen in 
                                every frame of the film. He is planning to release this beautiful
                                story of a little robo for the upcoming film festivals. I wish him 
                                success in his efforts as he deserves it.

(సశేషం...)

Posted by చంద్రం on 9/26/2011 09:33:00 AM

 
(సశేషం...) 
ఎంత దూరం నడిచానో? 
అంగుళమైనా కదిలింది లేదు. 
నెత్తిన సూర్యుడు అక్కడే ఉన్నాడు.
ఐనా,
ఆకాశం కిందనించీ ఎక్కడికెళ్తాం?
ఒక్క అడుగైనా అడక్కుండానే
అంతా తీసేసుకున్నావు.
ఒక నువ్వూ...ఒక ఆకాశం!
రెండు సరిహద్దుల మద్య నేను.
గా..లి..లాగా నీ ఙ్ఞాపకం...
ఊపిరి పోస్తూనే ఉంది.
                         - చంద్రం
                     





PC Tips 2

Posted by చంద్రం on 9/25/2011 08:28:00 PM



Unlock password protected memory cards:

Well its quite simple but most of the people do not know it.
Please note the fact that it only works if the password to the MMC Card was set in your own mobile,where u want it to be unlocked.
This method works well for nokia cells with symbian operating system.Never tried on other cells.use any software like FXplorer that can browse files in your cell.

1. Open one of above software you have.
2. Browse through the directory, C:system
3. Rename the file mmcstore to mmcstore.txt
4. Open the file - The file will open in Notes.
5. You will find your password in that file. That file would also contain much more data which you do not understand,so you need to go through the file to get the password!

When your cell is connected to PC by means of data cable or blue tooth, u can see the password by simply opening the file mmcstore with notepad.









PC Tips 1

Posted by చంద్రం on 9/25/2011 08:26:00 PM

         
* These tips and tricks have been searched through Google and other resources. Whenever I get a problem I used to Google around until I get some solution. I have tried these tips and they are working. I present them here for people who need them. Here comes the first tip...Enjoy...!!!
 
 
Make Your  Menus Load Faster

     This is one makes a huge difference to how fast your machine will 'feel'. What it does is remove the slight delay between clicking on a menu and XP displaying the menu.

Go to Start then Run
Type 'Regedit' then click 'Ok'
Find "HKEY_CURRENT_USER\Control Panel\Desktop\"
Select "MenuShowDelay"
Right click and select "Modify'
Reduce the number to around "100"
This is the delay time before a menu is opened. You can set it to "0" but it can make windows really hard to use as menus will open if you just look at them - well move your mouse over them anyway. I tend to go for anywhere between 50-150 depending on my mood.







శ్వాస

Posted by చంద్రం on 9/25/2011 05:47:00 PM


శ్వాస కూడా ఒక సమరం.

గుండె నిండా గాలి పీల్చందే


ఏ జాతి విముక్తమైంది చెప్పు?


శ్వాసంటే రెండు తిత్తులనిండా


గాలి కాదు.


రెండులోకాల మద్య స్వేఛ్చా పయనం!


ఎన్ని గుండెల్ని నీవిగా చేసుకుంటే


ఒక జాతి స్వేచ్చని శ్వాసించగలవో


అలుపెరుగని వీరుణ్ణడుగు.


అసువులు బాసిన


అమరుణ్ణడుగు.


ఎవరి శ్వాసకి వాళ్లే భాధ్యులైనట్టు


ఎవరి స్వేచ్చకి వాళ్లే భాధ్యులు.


ఎవణ్ణడిగి నీ గుండె కొట్టుకుంటోంది కనక...


గుండె కొలిమిలో విరిగిన కలల్ని రాజేయి.


భయం కప్పిన పిరికి దుప్పట్లని తీసేయ్.


ఎంత గుండె ఉందో నీకు శ్వాస తీసి చూసుకో.


ఎంత స్వేఛ్చని కోరుకుంటోందో ఒక్కసారి తడుముకో.


ఉద్యమాలు అవసరం లేదు...


ఖడ్గచాలనాలక్కర్లేదు.


ఒక్క గుండె చాలు నువ్ శ్వాసించడానికి.


ఒక్క శ్వాస చాలు నీకు స్వేఛ్చనివ్వడానికి.


ఏ కాలంలోనైనా సరే,


శ్వాస నీ హక్కు.


స్వేఛ్చ నీ ఊపిరి.


నిద్రపోయే జాతికి భాద్యతలుండవ్.


అవి లేని వాళ్లకి హక్కులుండవు.


                                            - చంద్రం





కెలైడోస్కోప్

Posted by చంద్రం on 9/25/2011 05:24:00 PM



చాప కింద నీరులా

చావొచ్చి పడటం తెలుసా?


కల మీద కల పేరుకుంటూ


కాలాన్ని కుంచింపచేస్తున్న


కెలైడోస్కోపిక్ మాయ తెలుసా?


బుర్రనిండా...


కొమ్మ కొమ్మకూ చిగురిస్తోన్న


లాలస చూడూ...


కారుణ్యమా?...డామిట్!!


సగం పండు తిన్నాకా ఇంకేం


ఇతిహాసం రాస్తావ్?


జరుగు...జరుగు...


ఇంకోడొస్తున్నాడు.



                                      - చంద్రం 


 

Saint Girl

Posted by చంద్రం on 9/25/2011 01:49:00 AM
 

         'Saint Girl' is one of my character designing practice works. Earlier when I was working for a feature syndication company, I used to work on lot of characters...mainly cartoons. Later I have got exposed to lot of art and animation material which helped me to go through the practice.


Orphan-Street Boy

Posted by చంద్రం on 9/25/2011 01:34:00 AM
 

 This is an old drawing which 
I've done for a child labour 
project. I am trying to find 
out the story board also.
 Now a days I am working
with wacam Intuos 4, but 
still...I like the brush line.



రచ్చబండ - అన్నన్నా...

Posted by చంద్రం on 9/24/2011 06:48:00 PM


ప్రతీ ఉద్యమం ఒక స్వాతంత్ర్య సంగ్రామం కాజాలదు...

ఎవరు పడితే వాళ్లు గాంధీలు కాలేరు...!



              అది అవినీతి మీద పోరు ఐనా సరే...మరొకటైనా సరే...! 

            అసలు అన్నాహజారేని గాంధీతో ఎందుకు పోల్చాలో, ఎలా పోల్చాలో...అసలు ఆ అవసరమేంటో అర్థం కాదు. సత్యానికీ, ధర్మానికీ, స్వేఛ్చకీ గాంధీ ఒక ప్రతీక. మీడియా వాళ్లు అత్యుత్సాహంతో సొంతంగా బిరుదులు ఇవ్వడం మాని, జరుగుతున్న పరిణామాలను సహేతుకంగా చూడకపోతే జనం వెర్రిగొర్రెల్లా పూనకం తెచ్చుకోక మరేం చేస్తారు? ఉన్మాద స్థాయికి చేరుకున్న ఏ ఉద్యమమైనా అరాచకత్వాన్ని కాక దేన్ని ప్రేరేపిస్తుందో అన్నాకి తెలియదా? మీడియా ఎంత ఎగిరిస్తే అంత ఎగరటమే తప్ప అసలు ఈ ఉద్యమాలకి ఒక ఆదీ అంతం ఏమైనా ఉందా? ముందుగా ఉద్యమాల్లోంచి మీడియా ప్రేరణని, ఓట్ల లెక్కలనీ తీసేస్తే తప్ప ఉద్యమకారుల సహేతుకతని, నాయకత్వ సామర్ధ్యాన్నీ విశ్వసించలేని పరిస్థితిని చూస్తున్నాం ఇప్పుడు.

             ప్రతీ ఉద్యమానికీ ఒక ప్రత్యేక నేపథ్యం, పరిస్థితులూ ఉన్నట్లే, ప్రతీ ఉద్యమకారుడు అందుకనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిస్థితులను చూస్తే ముల్లుని ముల్లుతోనే తీయాలనే సంకల్పానికే గాంధీ ముసుగు వేస్తున్నట్టు ఉందే తప్ప మరోలా లేదు.

            అవినీతిని అంతమొందించాల్సిదే. మంచిదే. ఎవరూ కాదనరు. అదే సమయంలో ఉద్యమాన్ని సమ్మె స్థాయికి దిగజార్చడం ఉద్యమ స్పూర్తికే విఘాతం కలిగిస్తుందని ఎవరూ మరిచిపోకూడదు. ఉద్యమ మార్గదర్శకాలను పక్కదారి పట్టనివ్వకూడదు.

            నా ఉధ్దేశ్యం ఎప్పుడో మొదలవ్వాల్సిన ఉద్యమం ఇప్పుటికైనా ఆరంభమయ్యింది. దానికి ప్రజల ఆకాంక్ష కూడా తోడై, సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి రాగానే గోడదూకి పారిపోయే బాబాలు, విచక్షణ లేకుండా ప్రజాస్వామ్యాన్నీ, ప్రభుత్వ విధానాలని అవహేళన చేస్తూ మాటకి మాటా అన్నట్టుగా విమర్శించే పౌరసమాజం సాటి భారతీయులను ఎటు వైపు నడిపిస్తున్నట్టూ?


            నాకొక కథ గుర్తుకొస్తోంది.

            ఒక చాకలివాడు రోజూ చెరువులో బట్టలు ఉతుక్కునేవాడు.

            అదే దారిలో రోజూ ఉదయాన్నే ఓ పండితుడు స్నానానికో, దేనికో వెళ్తుండేవాడు. ఓ రోజు చాకలివాడు బట్టలు ఉతుకుతోంటే ఆ నీళ్లు ఎగిరి పండితుడి మీద పడ్డాయి. పండితుడికి కోపం వచ్చింది. " ఏంట్రా ఇదీ? " అని కసురుకున్నాడు. చాకలివాడు " ఫో..ఫోవయ్యా.." అనే వుంటాడు. పండితుడికి తను చదువుకున్న చదువంతా ఈ చాకలివాడి ముందు నిరర్ధకమయ్యిందే అని భాధతో కూడిన కోపం వచ్చింది. తన పాండిత్యమంతా ఉపయోగించి చాకలివాడికి అర్ధం కాకుండా తిట్టేసాడు. ఎంత చాకలివాడైనా తక్కువ తినడు కదా...వాడూ పురాణం అందుకున్నాడు.

            అసలు విషయమేంటంటే, ఇదంతా పైనించి చూస్తున్న దేవుడు 'అరెరే...ఈ చాకలివాడు ఉత్తముడైన పండితుణ్ని పట్టుకుని దుర్భాషలాడి, అవమానిస్తున్నాడే' అని కిందకి బయలుదేరాడు...పండితుణ్ని కాపాడటానికి! తీరా దేవుడు కిందకి వొచ్చేసరికి పండితుడూ, చాకలివాడూ ముష్టియుద్దం చేస్తూ కనపడ్డారు. దేవుడు ఒక్క క్షణం ఇద్దర్నీ చూసి, ఇద్దరూ ఒకే సమానమైనప్పుడు ఇద్దరిలో ఎవర్నీ కాపాడనఖ్ఖర్లేదని నిర్ణయించుకుని, వెనుతిరిగి వెళ్లిపోయాడు.

            ఇవ్వాళ అవినీతిపైన పోరాటానికి జనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నారంటే, జనం తప్పకుండా ఒక ఉద్యమాన్ని కోరుకుంటున్నారనీ, ఉద్యమ అవసరాన్ని గుర్తించారనే అర్ధం. ఈ అవినీతి ఉద్యమం ధాటికి కనీసం నలుగురైదుగురు నేరస్థులైనా న్యాయస్థానంలో దోషులుగా నిలబడగలిగారన్నా,వాళ్ల నేరాలకు మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమౌతున్నారన్నా అందుకు సంతోషించాల్సిందే. ఇది ఉద్యమాన్ని వత్తిలా మరింత ఎగదోసే విషయమే. అందులో సందేహం లేదు. ఐతే, ఏ రకంగా చూసినా అవినీతి మీద పోరాటాన్ని ఈ స్థాయికి తీసుకురాగలిగినందుకు ప్రజలు అన్నా హజారేని ఎంతగా ఆరాధిస్తున్నారో, ఉద్యమం పక్కదారి పట్టిన నాడు అంతే తేలిగ్గా తేసుకుంటారని గమనించాలి. అలా కాకుండా ఈ సమస్యకి ఒక ధీర్ఘకాలిక పరిష్కారం దొరికేలా పౌరసమాజం తగిన జగ్రత్త వహించాలి. అంతే కాదు, భవిష్యత్ లో ప్రజాసంక్షేమం కోసం జరిపే మరే ఉద్యమమైనా సరే, దాని విశ్వసనీయతకి ఈ పరిణామాలు గొడ్డలిపెట్టు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ఉద్యమనేతల మీద ఎంతైనా ఉంది.

            ఇక్కడ అత్యంత ముఖ్యమైన మరో సంగతి...అందరూ దృష్టి సారించాల్సిన విషయమేంటంటే...ఎందుకు, ఎలా వారం రోజుల్లో అన్నాహజారే మరో గాంధీ కాగలిగాడో? ఎందుకు పదకొండేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇరోమ్ షర్మిళని ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదో ప్రజలూ, మీడియా ఆలోచించాలి. మణిపూర్ మహిళలు బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిరసన తెలపాల్సిన దుస్థితికి ఎవరు జవాబు చెప్తారూ?

            ఉద్యమకారులమని ముందుకొచ్చే వాళ్ల నిబద్ధతనీ, విశ్వసనీయతనీ నిగ్గుతేల్చుతూనే ప్రజలను సంయమన పరచాల్సిన బాధ్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా మీదే ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వాలూ, నేరస్తులూ రకరకాల రంగుల్లో, కొత్తకొత్త పధ్దతుల్లో నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నా, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మారకపోవడం ముఖ్యమైన లోపమనేది ఎవరూ కాదనలేని నిష్టురసత్యం. చట్టాలు చేయడానికి పూనుకునే ముందు చేయవలసిన ముఖ్యమైన పని మరొకటి ఉంది. అది నేర నిర్వచనాలని
 మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరిదిద్దటం. అసలు జరుగుతున్న నేరాలని నేరాలుగా గుర్తించటానికీ, నిరూపించటానికే న్యాయస్థానాల సమయమంతా వృధా ఐతే నేరస్తులకు శిక్ష పడేదెప్పుడూ...బాధితులకు న్యాయం జరిగేదెప్పుడూ? భూమ్మీద జరిగే ప్రతీ విషయాన్ని మొదటినించీ మళ్లీ కొత్తగా కనుగొనే ప్రయత్నం చేయకుండా నేరాల్ని సమర్ధంగా ఎదుర్కొంటున్న, నిలువరిస్తొన్న దేశాలను గమనించి, వాటి విధానాలు మనకెంతవరకు పనికొస్తాయో చూసి, చట్టాలని సవరించుకునే ప్రయత్నం చేయటం మేలు కదా.

            ఐతే, చట్టాలు చేయవలసిన ప్రభుత్వాలే అవినీతి మురికికూపంలో కూరుకుపోవడం చూస్తుంటే...దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంది పరిస్థితి. దీనికి ఎప్పటికైనా తప్పనిసరిగా ఒక ధీర్ఘకాలిక పరిష్కారం వెదికి తీరాల్సిందే. ఇప్పుడు మొదలైన అవినీతి సమరం అలాంటి పరిష్కారాన్ని సాధించగలిగితే భారతదేశం ఆర్థికంగానే కాదు, నైతికంగా కూడా మరొక్క ముందడుగు వేయడం ఖాయం. అలా జరగాలని ఆశిద్దాం.

            జై భారత్ !!!

మీ...

-చంద్రం

Old works

Posted by చంద్రం on 9/24/2011 05:06:00 PM
Hi there,

             Here I've posted some of my old works which I've done for various projects. Few of them are my personal interests. Any way sharing them with all of you is a wonderful feeling. Don't hesitate to comment or suggest any thing. I would love to hear from you all. You can view the responses in the comments box.
I am still struggling to manage my blog the way I wanted it to be. Thanks for the Fav.


Love,
Chandram

Raju By Chandram

Posted by చంద్రం on 9/24/2011 04:55:00 PM

 This one is one of my favorite drawing. Done with brush and Indian Ink. I love the idea kids feeling like kings, heroes, super mans...! Even my son is not an exception.

Sketch

Posted by చంద్రం on 9/24/2011 04:54:00 PM
Sketch



Children's Show By Chandram

Posted by చంద్రం on 9/24/2011 04:54:00 PM

Naga By Chandram

Posted by చంద్రం on 9/24/2011 04:53:00 PM

Cute Little Girl By Chandram

Posted by చంద్రం on 9/24/2011 04:52:00 PM

Conan By Chandram

Posted by చంద్రం on 9/24/2011 04:52:00 PM

అంతా ఇంతే...

Posted by చంద్రం on 9/21/2011 08:41:00 PM
       ఒక పే...ద్ద
 కొండ ఉంది.
      
       కిందంతా లోయ!
       అందులోగానీ పడ్డామంటే ఆనవాలు కూడా దొరకదు. అక్కడ ...ఆ కొండ చివర....
అంచున నిలబడి ఒక వ్యక్తి...! దేన్నో తేరిపారా చూస్తున్నాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చాడు. నిలబడి చూస్తున్న వ్యక్తినీ, ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్నీ చూసాడు. ఎప్పుడూ ఉండేదే తప్పా పెద్దగా చూడాల్సిందేమీ కనపడలేదు.
       "సార్...ఏం చూస్తున్నారో ?"
       "... ... ... ?"
       మొదటి వ్యక్తి మాట్లాడలేదు. రెండో వ్యక్తికి సంగతి అర్థమయింది. ఇదేదో కొండ దూకే బాపతులా ఉంది అనుకుని, ఏవైనా నాలుగు మాటలు చెప్తామనుకున్నాడు.
       "ఇంతకీ ప్రాబ్లం ఏంటో?"
       " ... ... ... "

       రెండో వ్యక్తికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. "చూడండి సార్, మీకు చెప్పేటంత వాణ్ని కాకపోవచ్చు. కానీ సమస్యలనేవి అందరికీ వస్తాయి. మీకు తెలుసా, అదేదో డేశంలో ఒకావిడ...పాపం, కాళ్లూ,చేతులూ లేకపోయినా ముక్కుతో బొమ్మలు గీసి గో..ప్ప పేరు తెచ్చుకుందిట. ఆ మద్య రెండు చేతులూ లేని ఒకతను పట్టుదలతో శ్రమించి, స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ప్రైజ్ కూడా తెచ్చుకున్నాడట....ఐనా..." రెండో వ్యక్తి ఇంకా ఏదో చెప్పబోతోంటే మొదటి వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. ఇంతెత్తున గయ్య్..న లేచాడు.  "ఏమయ్యా, బుద్దుందా నీకూ? నన్ను చూడూ... నా కాళ్లూ, చేతులూ కనిపిస్తున్నాయా? కన్నూ, ముక్కూ, నోరూ అన్నీ సరిగ్గానే ఉన్నాయా, లేదా? అసలు నాకేం తక్కువనీ? ముక్కుతో బొమ్మలు గీయటానికీ, కాళ్లతో అన్నం తినడానికీ నాకేం ఖర్మా? ఫో..ఫోవయ్యా, ఇంకోసారి  నోటికొచ్చినట్టు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు,జాగ్రత్త!"  అని విసురుగా కొండ దిగి, విసావిసా నడుచు కుంటూ ఊరివైపు వెళ్లిపోయాడు. రెండో వ్యక్తికి ఏంచేయాలో పాలుపోలేదు. కొండఅంచున  నిలబడి, తదేకంగా చూడాలన్న ఆలోచనని విరమించుకుని, తనూ నెమ్మదిగా కొండదిగి, ఊరివైపు నడిచాడు.

        ప్రపంచంలో డబ్బున్నవాళ్లున్నారు...లేని వాళ్లున్నారు...చదువున్న వాళ్లున్నారు...లేనివాళ్లున్నారు...తెలివైన వాళ్లూ, లేనివాళ్లూ ఉన్నారు. ఉద్యోగం, పదవీ, భార్యా, పిల్లలూ, పేరు ప్రతిష్ఠలూ, ఆస్తులూ, ఐశ్వర్యాలూ ఉన్నవాళ్లు న్నారు...లేని వాళ్లున్నారు...ఓడలు బళ్లు అవుతుంటాయి. బళ్లు 
ఓడలు అవుతుంటాయి. ఇదంతా ముందో వెనకో జరిగి తీరుతుంది. 
కా...నీ...
        సమస్యలు లేని వాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఇది తెలిసీ, తెలియకా చాలా మంది కుంగిపోతుంటారు. తెలిసి కొంతమంది సమస్యని కూడా ఛీట్ చేయడానికి వీలవుతుందేమోనని వ్యర్థప్రయత్నాలు చేస్తుంటారు. ఆలోచిస్తే అన్నీ మనకే అర్థం అవుతాయి.
        అనుభవమైతే గానీ తత్వం బోధపడదు కదా.

       సర్వేజనా సుఖినో భవంతూ...!!! 

ఎవరో గుర్తించారా?

Posted by చంద్రం on 9/17/2011 04:19:00 PM

క్రింద ఫోటోలలో కనిపిస్తున్న ప్రముఖ వ్యక్తి ఎవరో గుర్తించారా?




తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావుడు....


తెలుగు వారిని ఙ్నానపీఠం ఎక్కించిన మహారచయిత.....


గుర్తు పట్టారా...!
మన  విశ్వనాథ సత్యనారాయణ గారు.
ఆయన అపురూపమైన ఫోటోలు ఇవి.

త్వరలోనే ఎన్నో సమీక్షలూ...పరిచయాలూ... తెలుగుజాబిలి సాహిత్యం పేజీల్లో రాబోతున్నాయి.