శ్వాస
శ్వాస కూడా ఒక సమరం.
గుండె నిండా గాలి పీల్చందే
ఏ జాతి విముక్తమైంది చెప్పు?
శ్వాసంటే రెండు తిత్తులనిండా
గాలి కాదు.
రెండులోకాల మద్య స్వేఛ్చా పయనం!
ఎన్ని గుండెల్ని నీవిగా చేసుకుంటే
ఒక జాతి స్వేచ్చని శ్వాసించగలవో
అలుపెరుగని వీరుణ్ణడుగు.
అసువులు బాసిన
అమరుణ్ణడుగు.
ఎవరి శ్వాసకి వాళ్లే భాధ్యులైనట్టు
ఎవరి స్వేచ్చకి వాళ్లే భాధ్యులు.
ఎవణ్ణడిగి నీ గుండె కొట్టుకుంటోంది కనక...
గుండె కొలిమిలో విరిగిన కలల్ని రాజేయి.
భయం కప్పిన పిరికి దుప్పట్లని తీసేయ్.
ఎంత గుండె ఉందో నీకు శ్వాస తీసి చూసుకో.
ఎంత స్వేఛ్చని కోరుకుంటోందో ఒక్కసారి తడుముకో.
ఉద్యమాలు అవసరం లేదు...
ఖడ్గచాలనాలక్కర్లేదు.
ఒక్క గుండె చాలు నువ్ శ్వాసించడానికి.
ఒక్క శ్వాస చాలు నీకు స్వేఛ్చనివ్వడానికి.
ఏ కాలంలోనైనా సరే,
శ్వాస నీ హక్కు.
స్వేఛ్చ నీ ఊపిరి.
నిద్రపోయే జాతికి భాద్యతలుండవ్.
అవి లేని వాళ్లకి హక్కులుండవు.
- చంద్రం
0 Responses to "శ్వాస"
Leave A Comment :