ఆ మద్య ఒక సినిమా చూసాను. దాని పేరు 'In to the wild'. ఒక నిజజీవిత కథ ఆధారంగా అల్లబడిన సినిమా. చూస్తున్నంతసేపూ మామూలుగానే చూసాను. సినిమా అయిపోతోంటే కూడా మామూలుగానే ఉంటుంది. చమత్కారమైన డైలాగులు గానీ, ఒళ్ళు గగుర్పొడిచే సీన్లు గానీ, భీభత్సమయిన పతాక సన్నివేశాలు గానీ ఏమీ ఉండవు. అదేం పెద్ద విషయం కాదన్నట్టుగానే ఉంటుంది హీరో వ్యవహారం కూడా.
సినిమా అయిపోతుంది.
అపుడు తగులుకుంటుంది 'hook' మనకి...చివరగా హీరో తన డైరీలో రాసుకున్న చివరి ఫంక్తులు చదివాక...
" Happiness is real when it is shared".
నాకు అర్థం అయినంతమటుకూ సినిమా చూసినవాళ్ళెవరైనా ఆ తరువాత ఆ ఫంక్తులు మర్చిపోవడం అసాధ్యం. ఆ తరువాత మన జీవితంలో ఎన్నో సంధర్భాల్లో అవి గుర్తుకువొస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైనా తెలివిగా confuse అయినా మళ్ళీ మనని సరిచేస్తోనే ఉంటాయి. రకరకాల యిజాల గొడవలో పడి, అన్నీ వొదులుకోమ్మనే వైరాగ్యం నించీ, మొత్తం లాగేసుకోమనే లౌక్యం మద్యన మనం గింజుకుంటున్నపుడు మనల్ని మనం నిటారుగా నిలబెట్టుకోవడానికి గానూ ఈ మాటలు గుర్తుకొస్తూనేఉంటాయి.
నాకూ గుర్తుకొచ్చాయి...నిన్న ఈ కింద లింకుకి వెళ్ళి, చదివాక.
నిజానికి ఆ టపా రాస్తున్నపుడు నాకు పెద్ద ఆలోచనేం లేదు. చాలా మందికి పనికొస్తుంది...అంతే! లింకులో శ్రీ భమిడిపాటి గారు ప్రస్తావించిన విషయాలు చదివాకా ఎందుకో పైన రాసినదంతా గుర్తుకొచ్చింది. అయితే జీవితాల్ని మార్చేసెటంత పెద్దవి కానక్కర్లేదు...చిన్నచిన్న విషయాల్లో కూడా ఇంత సంతోషం (మనకీ, ఇతరులకీ) ఉంటుందని ఈ బ్లాగు మొదలెట్టాకా ఇప్పుడే తెలిసింది. ఇంటర్ నెట్ సూత్రం ఉండనే ఉందిగా...sharing is the best. కాకపోతే ఏం share చేస్తున్నామన్నదే ముఖ్యమేమో! ఒక రకంగా ఈ టపా బ్లాగ్ నిర్వహణకి సంబందించి నాకు చాలా విషయాలని నేర్పించింది. సమంజసంగా స్పందించి, దాని ప్రాముఖ్యతని నాకు తెలియచేసిన శ్రీ భమిడిపాటి ఫణిబాబు గారికి నా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు!
మీ
చంద్రం