క్రమం తప్పకుండా బ్లాగులు రాసేవారికి రాసిన టపాలన్నీ కాపీ, పేస్టు చేసుకోవడం...అవన్నీ వరసక్రమంలో back up తీసుకోవడం నిజంగా శ్రమతో కూడిన పని. అదీకాక ఒక్కోసారి...అ..రు..దు..గా...మన బ్లాగులు కనిపించకుండాపోయే ప్రమాదముంది. అవి ఒక్కోసారి recover చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా recover చేసుకోవాలో తెలీక నానా ఇబ్బందిపడేవాళ్ళని అపుడపుడు చూస్తూనే ఉంటాము.
ఒక రకంగా చెప్పాలంటే మన బ్లాగు లేదా వెబ్ సైట్ ని యథాతదంగా back up తీసి పెట్టుకోగలిగితే అన్నిరకాలుగా మేలు. కానీ ఎలా? అందుకే ఈ టపా.
మీరు Windows 2000/ XP/ Vista/ Seven ఉపయోగిస్తున్నట్టైతే ఈ లింకుని క్లిక్ చేసి HTTrack అనే ఈ software ని download చేసుకోండి.
http://download.httrack.com/httrack-3.46.1.exe
లేదా ఈ కింద యిచ్చిన లింకుకి వెళ్ళి, మీకు సరిపోయే వెర్షన్ ని download చేసుకోండి.
http://www.httrack.com/page/2/
తరువాత...
Install చేయండి.
తరువాత...
HTTrack open చేసి, మీ బ్లాగుని ఏ పేరుతో, ఎక్కడ save చేయాలో type చేయండి.
తరువాత...
మీ బ్లాగ్ address ని HTTrack లో paste చేయండి. లేదా మీ బ్లాగు open చేసి, address bar లో మీ బ్లాగు url ని కాపీ చేసి, HTTrack లో paste చేయండి.
తరువాత...
మీ బ్లాగు మొత్తం download అయిపోయేదాకా wait చేయండి.
తరువాత...
మీరు download చేసుకున్న folderలో 'index' అనే file ని open చేసి చూడండి.
మీ బ్లాగు రెడీ...!
ఇప్పుడు మీరు internet connection లేకపోయినా (off line) మీ బ్లాగుని open చేసుకుని, యథాతదంగా చూడొచ్చు...browse చేయొచ్చు.