పాత మెయిల్స్ చెక్ చేస్తోంటే అటాచ్ మెంట్స్ లో ఈ బొమ్మ కనబడింది. రాజ్ టీవీ వొస్తున్న రోజుల్లో ఒకానొక ప్రకటన కోసం గీసిన కేసీఆర్ పోర్ట్రెయిట్ ఇది. మొదటినించీ నాకు పోర్ట్రెయిట్స్ మీద అంత ఆసక్తి ఉండేది కాదు. అందువలన నేను పోర్ట్రెయిట్స్ వేయడం చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ ఫ్రెండ్స్ బర్త్ డేలకి వాళ్ల కారికేచర్స్ వేసి, గ్రీటింగ్స్ ఇవ్వడం పాత ఆఫీసుల్లో ఒక అప్రకటిత నియమంగా జరిగేది. ఎప్పుడైనా మిత్రులో...బాగా దగ్గరవాళ్లో అడిగితే మొహమాటానికి పోయి,( గీయలేననో, అలవాటు లేదనో చెప్తే నమ్మరనీ ) అప్పుడప్పుడు ఇలా పోర్ట్రెయిట్స్ వేయాల్సివచ్చేది. ఇదీ అలా వేసిందే.
దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ కేసీఆర్ అభిమానులు చేయించిన ఈ యాడ్ సరిగ్గా గత దీపావళినాడు ఆ రోజంతా రాజ్ టీవీలో ప్రసారమైంది. ఐతే, కొసమెరుపు ఏంటంటే ఇది అందరితో పాటూ టీఆరెస్ నాయకుడు హరీశ్ రావుకి బాగా నచ్చడం..!