విరామసంధ్య

Posted by చంద్రం on 2/16/2013 07:41:00 PM



విరామసంధ్య






సియాచిన్ మంచు దుప్పట్లకింద...
గడ్డకట్టుకుపోయే చలిలో...
కళ్ళముందు చూపుల గీతల్ని పొడిగించుకుంటూ... పొగమంచు తెరల్ని కాల్చేస్తూ... శవంలా బిగుసుకుపోయి, రోజుల తరబడి త..దే..కం...గా గురిచూసుకుంటున్న సైనికుడికి... గురిచూసి పేల్చే సమయాన ప్రియురాలి నవ్వు గుర్తుకొచ్చినట్టు...నాడీకొసల నడుమ నిషా తరంగం పురుడు పోసుకుంటోంది.
...మై...కం...!!!
కళ్ళు మూతలు పడుతున్నాయి.
వొళ్ళు తేలిపోతోంది.
ఎక్కడిదీ మైకం?
ఆకలి...దప్పిక...నిద్ర...కోరిక...? కాదు...కాదు...!
ఆకర్షణకీ, వికర్షణకీ విభ్రమ చెందని మైకం...!
ఇహమో...పరమో తేడా తెలియనివ్వని మైకం !
అంతర్నేత్రం అంతటా అల్లుకున్న కోటిబాహువుల కలల Lattice కౌగిలి వెచ్చదనపు మైకం...!

                                                                                     *    *    *

కళ్ళు మూ..త...లు పడుతున్నాయి.
మూసుకున్న రెప్పల వెనక ఒకే ఒక దృశ్యం కదలాడుతోంది...!
ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది.
"ఇంకెంత దూరం?"
"ముప్పయ్ దాకా ఉండొచ్చు"
"మైళ్ళా?"
"కాదు... ఏళ్ళు"

                                                                                     *    *    *

ఎక్కడో పూలు విచ్చుకుంటున్న కలకలం.
అప్పుడప్పుడు గాలిపాట చప్పుడు.
ఒక్కోసారి నాకు నేనే కురుక్షేత్రపు dynamicsని తిరగరాస్తోన్న సంచలనం.
ఐనా...
అంతటా నిశ్శబ్దం!
Height of silence !
Arrogance of silence !!
డామిట్... silence !!!

"... ... ..."
                                                                                     *    *    *