స్వప్నమే ఆయుధం

Posted by చంద్రం on 8/17/2013 12:29:00 PM

 స్వప్నమే ఆయుధం



నాకు తెలుసు!
ఈ ఎర్రని పెదాలు...
ఏ గాయాల్నీ ముద్దిడలేదని.
రాత్రి కురిసిన వెన్నెల్లో
'తను' ఇచ్చిన
తాంబూలపు ఎరుపు కదూ అది?
నువ్ గుర్తించావ్
నీ దేహాన్ని ఆయుధంగా.
ఐనా...
అంతరాత్మలఖ్ఖర్లేని వాళ్లకి
ఆయుధాలెందుకూ?
చిన్న విస్ఫోటనం లాంటి పతనం.
ఒక జారుముడి విఛ్చేదనంతో
పచ్చని నిన్ను హరింపచేసే
బాహ్య ప్రేరక యత్నం.
నీకు తెలుసు...
తెలివే నీ ఆయుధమని!
ఒక ధుర్బల క్షణం నీ నైతికతని మింగి
నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది.
ఒక అమూర్త సామ్రాజ్యం
నిన్ను అధిపతిగా స్వీకరిస్తుంది.
నువ్వనుకుంటావ్...
గళమే నీ ఆయుధమనీ.
ఏమీలేని తనం
అన్నీ ఉన్న ప్రపంచాన్ని జయిస్తే...
ఒళ్లు బలిసిన పాట కత్తి
గొంతు ఒరలో ఇరుక్కుపోతుంది.
 నువ్వెంత మోదినా
నీ మెడలో గంగడోలు మోగదు.
చిట్ట చివరి స్వప్నం కూడా
నిస్పృహగా తలవాల్చేస్తుంది
వేధాంతపు తేనె పూసిన
కత్తిపదునులాంటి విషాధం
నిన్నూ, నీ స్వప్నాన్నీ వేరు చేస్తుంది.
అప్పుడు తడుముకుంటావ్ నువ్
చీకట్లో..
అచేతనమైన
నీ ఆయుధాన్ని వొదిలి.


- చంద్రం


అనగనగా పులి

Posted by చంద్రం on 8/16/2013 03:47:00 AM

 

 

అనగనగా పులి


    పైన కనిపిస్తున్న banner గురించి convenientగా మర్చిపోయి, కాసేపు అనగనగా అడవిలో పులి లాంటి కథేదైనా చెప్పుకుందాం! మనసు కాస్త తేలికవుతుంది. 


    సరే…!

    …నగనగా...
    ఒక అత్యంత క్లిష్టమైన అడవి!
    అబుజ్ మాడ్ లాంటిది! అందులో...
    పరమ వెనకబడిన గూడెం ఒకటుంది.
    దానికో దొర ఉన్నాడు...!
    వాడికో కూతురుంది...!!
    దానికిప్పుడు పెళ్ళి చేయాలి...!!!
    గూడెం దొర కూతురి పెళ్ళి అంటే మాటలా?  Definiteగా కాదు. కానీ...ఇక్కడ మన కథలో పరిస్థితులు వేరు.
మనం బాగా వెనకబడిందని అనుకుంటాం గానీ ఇక్కడి తెగలో ఆచార వ్యవహారాలు మాత్రం మహా కట్టుదిట్టంగా ఉంటాయి. ఉదాహరణకి... ...ఈ పెళ్ళి గురించే చెప్పుకుందాం.
    గూడెందొర కూతుర్ని పెళ్ళి చేసుకోవాలంటే Microsoftలో ఉద్యోగం సంపాదించో, facebook...twitter లలో chatting చేసో, పబ్బుల్లో, పార్కుల్లో తిప్పో, అమ్మానాన్నా కొనిచ్చిన bikeల మీద షికార్లు చేయించో... ముందు పిల్లని పడేసి, ఆనక ఆమె తల్లిదండ్రుల్ని manage చేయడం లాంటి పప్పులేం ఉడకవ్ . 
    గూడెం ఆచారం ప్రకారం ఆ పిల్లని పెళ్ళి చేసుకోవాలనుకునే యువకులు ఒంటరిగా అడవిలోకెళ్ళి, పులిని వేటాడి, చంపి, తెస్తేనే పెళ్ళి!
    అటవికులు కదా...బలంగా ఉంటారు...వాళ్ళకి పులిని చంపటం ఓ లెఖ్ఖా...అనుకుంటాంగానీ, అడవిలో పులులు కూడా మన జూ పార్కుల్లో పులుల్లా ఉండవు కదా! అందుకని ఎవ్వరూ అలాంటి పిచ్చి ఆలోచనలు చేయలేదు. ఎలాగోలా దొర కూతుర్ని పెళ్ళి చేసుకుందామని ఆశపడ్డ నలుగురైదుగురు యువకులు... నానా తిప్పలుపడి, అడివిలోకెళ్ళి, ఒకడు పులిగోరూ, ఇంకొకడు పులితోలు తెచ్చారు గానీ దొర నమ్మలేదు.
    పులిని చంపి యథాతధంగా తెస్తేనే యథాతధంగా పిల్లనిస్తానన్నాడు.
    అలా కొంతకాలం గడిచింది.
    పైకి బింకంగానే ఉన్నాడుగానీ దొరకి లోపల అనుమానంగానే ఉంది. గోర్లూ, వెంట్రుకలూ తెచ్చే వీళ్ళు పులిని చంపి తెచ్చేసరికి తన కూతురు ముసిల్దైపోతుందని అర్థమయ్యింది. పోనీ గూడెం యువకుల్లో ఉత్సాహం నింపడానికి ఏవయినా offerలు ప్రకటిద్దామనుకున్నాడు గానీ నామర్దా అని ఊరుకున్నాడు. కానీ ఏం చేయాలో తోచలేదు.
    అంతలో ఓ రోజు ఇద్దరు కుర్రాళ్ళు ఓ వార్త మోసుకొచ్చారు. వెంటనే గూడెం మొత్తం ఆ వార్త గుప్పుమంది. దొర ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. గూడెం గూడెం కదిలి ఆ వార్త తెచ్చిన కుర్రాళ్ళు చెప్పిన చోటుకి బయలుదేరింది.
    ముందు దొర...! వెనక జనం...!!
    అక్కడికెళ్ళాకా ఆ కుర్రాళ్ళు చూపించిన దృశ్యం చూసి అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దొర కళ్ళలోంచి జలజల నీళ్ళుకారాయి.
    ఎనిమిదడుగుల పొడవైన చచ్చిన పులి...దాని పొట్టలో గుచ్చుకున్న పొడవాటి ఈటె...పక్కనే హాయిగా ఆదమరిచి నిద్రపోతున్న యువకుడు...! ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం అఖ్ఖర్లేదనిపించింది దొరకి. అన్నింటికన్నా ముఖ్యమైన సంగతేంటంటే, వాడు తమ గూడెం వాడే! ఏ పక్క గూడెపు యువకుడో అయి ఉంటే తన కూతురికి చచ్చినట్టు కులాంతర వివాహం చెయ్యాల్సొచ్చేది. ఆనందంతో గుండె లయ తప్పడమంటే ఏంటో దొరకి మొదటిసారిగా అర్థమయ్యింది.
    చకచకా పెళ్ళి ఏర్పాట్లయిపోయాయి. అధికార పర్యటనకొచ్చిన మంత్రికి జరిగినట్టు యువకుడికి సకల మర్యాదలూ జరుగుతున్నాయి. పెళ్ళి రోజొచ్చేసింది. దొర కూతురూ...యువకుడూ ఇద్దరూ చేతుల్లో దండలు పట్టుకుని గూడెం దేవత విగ్రహం ముందు నించున్నారు.
    పాపం, ఆ యువకుడి చేతులు ఎందుకో వొణుకుతున్నాయి.
    ఓరకంట చూసేంత సిగ్గేం లేదు కాబట్టి నేరుగా చూస్తూనే ముసిముసిగా నవ్వింది దొర కూతురు.
    అంతకన్నా నేరుగా అడిగేశాడు దొర...
    ”ఏం బాబూ, సిగ్గు పడుతున్నావా?”
    “అ..అ..బ్బే లేదండీ. భయపడుతున్నాను” అన్నాడా యువకుడు క్లియర్ గా.
    దొరకి ఆశ్చర్యం కలిగింది. 
    పులిని చంపి, దానిపక్కనే రాత్రంతా ఒళ్ళు తెలీకుండా నిద్రపోయినవాడికి బయ్యిమా?
    ఎందుకూ?
    అదే అడిగాడు. ఆ యువకుడు కొంచెం సంశయించి...గూడెం భాషలో...
    “Actualగా ఆ పులిని నేను చంపలేదయ్యా...దాని జోలికి కూడా వెళ్ళలేదు. పైగా అదే నావెంటబడి తరిమిందయ్యా...” అన్నాడు complaint చేస్తూ.
    గూడెం జనమంతా ఒక్కక్షణం ఊపిరి తీయడం మర్చిపోయారు. ఆకు కదిలితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుందక్కడ. ఈ జన్మకిక పెళ్ళవుతుందో లేదోనన్న confusion తో దొర కూతురికి ఏ క్షణమైనా స్పృహ తప్పేలా ఉంది.
    ఎలాగోలా గొంతు పెగల్చుకుని అతి కష్టమ్మీద రెండే రెండు అక్షరాలు అడిగాడు దొర.
    “మ...రీ...?”
    యువకుడు ఓసారి చుట్టూచూసి, గట్తిగా ఊపిరి పీల్చుకుని ఇలా చెప్పాడు. “ ఆ పులి నన్ను తరుముతూంటే నేను భయంతో పరిగెట్టానయ్యా. కాలికి రాయి తగిలి పడిపోయానే గానీ లేకపోతే దానికి దొరక్కుండా పరిగెత్తి గూడెం చేరిపోదును...!”
    దొరతో సహా అందరూ ఉత్కంఠగా వింటున్నారు.
    “రాయి తగిలి నేను వెల్లకిలా పడిపోగానే నా చేతిలో ఈటె ఎగిరి, పొరపాట్న దాని కడుపులో గుచ్చుకుందేమోనయ్యా...అక్కడికక్కడే చచ్చింది”
    “మరి దాని పక్కనే నిద్రపొయ్యావ్...రాత్రంతా...?” దొర అడిగాడు.
    ఆ యువకుడు సిగ్గుపడుతూ...”పులి నా మీదకు దూకడం తలుచుకోగానే భయంతో స్పృహ తప్పిందయ్యా”
    వాణ్ణి పట్టుకుని, పులిలా మీదపడి, కరకరా నమిలి తినేయ్యాలన్నంత చిరాకు కలిగింది దొరకి.
    వెంతనే గూడెం పెద్దలందర్నీ సమావేశపరిచాడు. Topic ఏంటంటే... ‘ఇంతకీ వీడు పులిని చంపినట్టా...లేదా?’
    తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పోనీ, చంపినట్టే ననుకుందామా..వాడే నేను చంపలేదు మొర్రోనంటున్నాడు.
    ఊన్నట్టుండి దొరకి చక్కటి అనుమానం వొచ్చింది.
    “ఇంతకీ ఈ విషయం నువ్ మాకెందుకు చెప్పినట్టూ? నువ్ చెప్పకపోతే మాకు తెలిసే అవకాశమే లేదుకదా?” అని అడిగాడు.
    యువకుడి మొహంలో చెప్పలేనంత రిలీఫ్ కనిపించింది.
    “ఈసారెప్పుడైనా పులొస్తే నన్నెక్కడ చంపమంటారోనని భయమేసిందయ్యా” అన్నాడు. దొరకి వాణ్ణలా వొదలబుద్ది కాలేదు.
    “పెళ్లయ్యాక తెలిసినా అప్పుడేం చేయగలిగేవాళ్ళం కాదుకదా?” అన్నాడు.
    “అంతదూరం ఆలోచించలేదయ్యా...”
    మళ్ళీ మొదటికొచ్చింది సమస్య.
    ఇలాగైతే లాభం లేదనుకుంది దొర కూతురు. దొరకు ఉన్నన్ని అతితెలివితేటలు లేవుగానీ, ఆ పిల్ల తెలివైందే!
    గూడెం పెద్దల వాలకం చూస్తే ఆచారమనీ, వ్యవహారమనీ పెటాకులు చేతిలో పెట్టి, ఎవరిదారిన వాళ్ళు జారుకునేలా ఉన్నారు. అదీగాక భయంతో గజగజా వొణికిపోతున్న చెట్టంత యువకుణ్ణి చూస్తోంటే ఆ పిల్లకి ముచ్చటేస్తోంది. చందమామ కథల్లో వీరాధివీరులైన వీరుల్ని పెళ్ళి చేసుకోవాలని అమ్మాయిలు రోజల్లా కలలుకంటారని చదివి చెడిపోతాం గానీ నిజానికి భయం భక్తీ లేని మొగుడి కంటే గడగడా వొణికే మొగుడితోనే కాపురం సజావుగా సాగుతుందేమోనని ఆ పిల్లకి చెడ్డ అనుమానం కలిగింది. కానీ అటవికచట్టాల ప్రకారం వెయ్యి అబద్దాలు ఆడైనా నచ్చిన మగాణ్ణి పెళ్ళిచేసుకునే భాగ్యం లేనేలేదు. పోనీ...ఎదురుగా ఉన్న యువకుడిని చూద్దామా...ఎలాగోలా...ఏదో ఒక అబద్దం ఆడి, పెళ్ళిచేసుకుని సుఖపడదామన్న జ్ఞానమేదీ ఉన్నట్టు కనిపించడంలేదు.
    తనే ఏదైనా చేయాలి.
    తండ్రిని పిలిచింది.
    “నాయినా! నేనీననే చేసుకుంటా...” అంది నిశ్చయంగా. 

    "ఏ..న..నీ?" పరద్యానంగా అన్నాడు దొర.
    పొద్దున్న నిద్రలేచినప్పటినించీ continuousగా ఎదురవుతున్న అనూహ్య సంఘటనలతో దొర మెదడు completeగా పనిచెయ్యడం మానేసింది. నిర్వికారంగా కూతురివైపు చూసాడు. ‘గూడెం దేవత కరుణించి ఒక్క నిమిషం ఇక్కడున్న వాళ్ళ మైండ్ లు పనిచేయకుండా ఉండేలా వరమిస్తే...నిమిషం లోపలే ఈ పెళ్ళి జరిపించేయాలని తనకి మాత్రం లేదా?’
    “ఎట్లా బిడ్డా?” అని అడిగాడు అదోలా.
    “ఇప్పుడూ... పులిని చంపినానని అబద్దం ఆడినోనికంటే చంపలేదని నిజం చెప్పినోడే ఎక్కువ కదా నాయినా?” కూతురి మాటలు విని దొరకి అనుమానం వొచ్చింది...'అవునా? ఇట్లాంటి complex విషయాలు ఈ మద్య తాను పట్టించుకోవడం లేదుగానీ...అయే ఉంటుంది’
    దొర కూతురు ఆలస్యం చేయలేదు “ఈన ...అటు పులిని చంపిండు...ఇటు నిజం చెప్పిండు. ఇంతకన్నా ఇంకేం కావాలే”
    గూడెం దేవత తన కూతురి రూపంలో వొచ్చి, బలవంతంగా లాగి, తన పాచిపట్టిన నాలుకమీద భీజాక్షరాలు రాసినట్టు...దొరకి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. అప్పటిదాకా జ్ఞానోదయమంటే చాలా నిదానంగా అవుతుందని నమ్మేవాడు దొర. కాలం కలిసొస్తే ఎంత speedగా జ్ఞానోదయమవుతుందో అర్థమై దొరకి పట్టరాని ఆశ్చర్యం కలిగింది.
    Cerebral hygiene..!
    యువకుడి మొహంలోకి చూసాడు. దురాశా...దుర్బుద్దీ లాంటి బాగుపడే లక్షణాలు ఏ కోశానా ఉన్నట్టు కనిపించలేదు. ఎందుకైతేనేం...వాటినెప్పుడో చంపేసాడు వాడు. ఇక భయమా...ఈ గూడెంలో పులిని చూసి భయపడని మగాళ్ళెవరూ? దొర మొహం ఒక్కసారిగా గుప్పుమని వెలిగి ఎందుకో మళ్ళీ అంతలోనే ఆరిపోయింది.
    “కానీ..వాడు ఒప్పుకోవట్లే కదా?” అన్నాడు నీరసంగా.
    దొర కూతురు యువకుడి వైపు తిరిగింది.
    “ఏమయ్యా! పులిని చంపిందెవరూ?”
    “అ... అ... ..అదే చ..చ్చింది”
    “దానికేం ఖర్మ చావడానికీ...?”

    యువకుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. “అంటే...పొరపాట్నఈటె త..గి..లీ...” గిల్టీగా నసిగాడు.
    “ఈటె దానంతట అదే తగిలిందా?” చాలా సహనంగా అడిగింది దొరకూతురు.
    “రాయి తగిలి నేను పడిపోవడం వల..న... ...అను..కో..కుండా...” వాడికింకా తన తప్పేం లేదనే అనిపిస్తోంది.
    దొర కూతురికి వాణ్ణి లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వొచ్చింది. అర్థం చేసుకోడేం?

    “అసలు నిన్నెవడు పడమన్నాడూ? నువ్వలాగే పరిగెత్తుకుంటూ గూడేనికొచ్చేస్తే ఆ పులి అట్నించటే వెళ్ళిపోయేది కదా? వొచ్చి నీచేతిలో ఉన్న ఈటెకి గుచ్చుకుని చావాల్సిన ఖర్మే ఉండేది కాదు దానికి!... నాకీ తిప్పలుండేవి కావు కదా?”
    రాయి తగిలి తాను పడిపోతే దొర కూతురికొచ్చిన తిప్పలేంటో ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ యువకుడు తెల్ల మొహం వేశాడు.

    ఈలోగా...
    “అంటే ...ఇతడివల్లే చచ్చిందంటావా పులీ?” పక్కనే ఉన్న గూడెం పెద్ద  ఒకరు తొందరపడ్డాడు.
    “అంతే కదా...” ఉత్సాహంగా అరిచారెవరో గుంపులోంచి.
    అంత తేలిగ్గా తీర్పులు చెప్పుకుంటూ, మిగిలిన శేషజీవితాన్ని సుఖంగా గడిపెయ్యొచ్చని గూడెం పెద్దలకు కూడా అప్పుడే అర్థమయ్యి, మనసు తేలిక పడింది.
    పెళ్లయిపోయింది.
                                        ***                        ***                        ***
    పులిని చంపాలని తుపాకి చేతపట్టుకుని...చీమలు దూరని చిట్టడవిలో మాటేసి మనం కూచుంటామా? ఎంతకీ పులి రాదు. అసలు అడవిలో పులి అనేది ఉందా అన్న అనుమానం కలిగేంతలో... మనకన్నా రహస్యంగా మాటేసి, మనలోపలే  దాక్కున్న పులి గాండ్రింపు వినిపిస్తుంది. దాన్ని పసిగట్టేసరికి సగం జీవితం గడిచిపోతుంది. దాన్నుంచి పారిపోతూ మిగతా సగం జీవితం గడిపేస్తాం.
    చదువుకునే రోజుల్లో ఒకతన్ని పట్టుకుని అందరూ ‘పులీ’ అని ఏడిపించేవాళ్ళు.
    కానీ ప్రతీ మనిషిలో ఒక పులి ఉంటుందనేది నా మూఢనమ్మకం. ఐతే, ఈ పులి మహా తెలివైనది. ఎప్పుడు మాటేయాలో... ఎప్పుడు దాడి చేయాలో బాగా తెలిసిన పులి. దాన్ని సరైన context లో అర్థం చేసుకోవడమే వివేకమనేది నా ఇంకో మూఢనమ్మకం. జీవితపు ఏ మలిసంధ్యలోనో...ఏదో ఒక సంఘటన ఎదురై, మనల్ని వొఠ్ఠి తోలుబొమ్మలా ఆడిస్తున్న పులిని నేరుగా సవాల్ చేస్తుంది. ఒకోసారి మన right motivesతో మన పులిని మనమే చంపి, గెలుస్తాం. ఒకోసారి ఇంకెవరో చంపి, మనల్ని గెలిపిస్తారు.  సహజంగానే చాలా సార్లు ఓడిపోతాం.
    అన్నట్టూ పులి అంటే గుర్తుకొచ్చింది...
    ‘You can take the tiger out of the jungle…but you can’t take the jungle out of the tiger’! అని ‘Calvin and Hobbs’ లో బుడింకాయంత Calvinకు కూడా వేలెడంత చిన్నప్పుడే రోజుకో chapter జ్ఞానోదయమవుతుందే? జీవితపు రెండో సగంలో కూడా ఇంకా ఈ పులిని మోస్తూ బ్రతికే వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
    ప్రేమగా సాకుతూ వాళ్ళు దాన్ని పెంచి, పోషించుకునే తీరునీ, దానిమీద వాళ్ళు పెంచుకున్న ఆరాధననీ చూస్తే భయం వేస్తుంది.
    దాని చారల్ని దాచిపెట్టడానికి
వాళ్ళు పడే అవస్థలు చూస్తే వొళ్ళు గగుర్పొడుస్తున్నట్టుగా ఉంటుంది.
    ...నిజమే!
    పులి బయటెక్కడో లేదు. లోపలే ఉంది! మన లోపలే మాటేసి ఉంది!!
    మన పులే కదా అని అనుకోలేం కదా? పులి పులే!
    Viva bravado…!!
 






*  ‘Save Tiger’ కీ... దీనికీ అస్సలు సంబందం లేదని మనవి.

ఇంకొక్కడు!!

Posted by చంద్రం on 5/26/2013 11:19:00 PM




ఇంకొక్కడు!!







విరామసంధ్య

Posted by చంద్రం on 2/16/2013 07:41:00 PM



విరామసంధ్య






సియాచిన్ మంచు దుప్పట్లకింద...
గడ్డకట్టుకుపోయే చలిలో...
కళ్ళముందు చూపుల గీతల్ని పొడిగించుకుంటూ... పొగమంచు తెరల్ని కాల్చేస్తూ... శవంలా బిగుసుకుపోయి, రోజుల తరబడి త..దే..కం...గా గురిచూసుకుంటున్న సైనికుడికి... గురిచూసి పేల్చే సమయాన ప్రియురాలి నవ్వు గుర్తుకొచ్చినట్టు...నాడీకొసల నడుమ నిషా తరంగం పురుడు పోసుకుంటోంది.
...మై...కం...!!!
కళ్ళు మూతలు పడుతున్నాయి.
వొళ్ళు తేలిపోతోంది.
ఎక్కడిదీ మైకం?
ఆకలి...దప్పిక...నిద్ర...కోరిక...? కాదు...కాదు...!
ఆకర్షణకీ, వికర్షణకీ విభ్రమ చెందని మైకం...!
ఇహమో...పరమో తేడా తెలియనివ్వని మైకం !
అంతర్నేత్రం అంతటా అల్లుకున్న కోటిబాహువుల కలల Lattice కౌగిలి వెచ్చదనపు మైకం...!

                                                                                     *    *    *

కళ్ళు మూ..త...లు పడుతున్నాయి.
మూసుకున్న రెప్పల వెనక ఒకే ఒక దృశ్యం కదలాడుతోంది...!
ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది.
"ఇంకెంత దూరం?"
"ముప్పయ్ దాకా ఉండొచ్చు"
"మైళ్ళా?"
"కాదు... ఏళ్ళు"

                                                                                     *    *    *

ఎక్కడో పూలు విచ్చుకుంటున్న కలకలం.
అప్పుడప్పుడు గాలిపాట చప్పుడు.
ఒక్కోసారి నాకు నేనే కురుక్షేత్రపు dynamicsని తిరగరాస్తోన్న సంచలనం.
ఐనా...
అంతటా నిశ్శబ్దం!
Height of silence !
Arrogance of silence !!
డామిట్... silence !!!

"... ... ..."
                                                                                     *    *    *



CARTOON-02

Posted by చంద్రం on 1/03/2013 07:42:00 PM

CARTOON-02