'
జుజుమురా'

Posted by చంద్రం on 11/25/2011 05:41:00 PM


          తెలుగుజాబిలి సహృదయంగా సమర్పిస్తోన్న శీర్షిక 'కథాకేళి'కి స్వాగతం. తెలుగులో మరుపురాని కథలను ఒక్కచోట చేర్చి, వాటిని సరైన రీతిలో, అపురూపంగా దాచి ఉంచుకునేలాగా తెలుగు కథాప్రేమికులకు సగౌరవంగా అందించటం మా ముఖ్య ఉద్దేశ్యం. ఈ శీర్షిక క్రింద మొదటగా తమ కథ 'జుజుమురా'ను (పునః)ప్రచురించడానికి అనుమతించి, వెన్నుతట్టిన శ్రీ గొల్లపూడి మారుతీరావు 
గారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు...!




















'జుజుమురా' కథ ఈ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.    

     
      * 'కౌముది' వెబ్ పత్రికలో శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి వ్యాసాలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
     
      *  శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి వెబ్ సైట్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి.   
 



'ఘటోత్కచ'

Posted by చంద్రం on 11/20/2011 09:32:00 PM
                           

చాల రోజుల క్రితం 'ఘటోత్కచ' అనే ఓ ఆనిమేషన్ మూవీ వొచ్చింది కదా...
ఆ సినిమా కోసం డెవలప్ చేసిన కారెక్టర్ ఇది. రెండు రకాలు చేసాను. 
ఒకటి ఘటోత్కచుడు వయసులో ఉన్నది (ఇదే) ఇంకొకటి కాస్త తరువాతది. 
ఒకరు ఫోన్ చేసి, చాలా బాగుందని మెచ్చుకునే వారు. ఇంకొకరు ఫోన్ చేసి
ఎవో మార్పులు చెప్పేవారు. మొత్తానికి ఎంచేతో ఒకే అవలేదు.



భూపేన్ హజారికాకు నివాళి

Posted by చంద్రం on 11/09/2011 11:30:00 PM
 

           

అనగనగా...చా...లా రోజుల క్రిందటి కథ!  

           అపుడపుడే బొమ్మలతో పాటూ పుస్తకాలూ, సినిమాలూ, సంగీతం వ్యసనాలుగా మారుతున్న రోజులు...ఎనబయ్యవ దశకం చివరివరకూ 
నాకు సంగీతం అంటే ఇళయరాజా మాత్రమే అని అనుకునేంత అభిమానం (
వెర్రితనం) ఉండేది. మద్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే అనేక మంది సంగీతకారులను అభిమానించేలోగానే వాళ్లు తెరమరుగైపోవటం, మళ్ళీ కొత్త గాలి వీయడం మాములైపోయింది. 

           అలాంటి పరిస్థితుల్లో నాకు పరిచయమైన వాళ్లు వరసగా ఎల్.సుబ్రమణియం, ట్రేసీ చాప్ మన్...ఆ వెనకే లాల్గుడి జయరామన్...బాలమురళీ కృష్ణ, పండిట్ శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా, బిస్మిల్లా ఖాన్...ఇలా ఎందరో...! 

           ఓ వైపు ఇళయరాజా రాగమాలిక, సిందుభైరవి, ఆత్మబంధువు, సాగరసంగమం వరసగా సాగుతుండగానే మరొవైపు వీళ్ళందరూ నా మీద ముప్పేట దాడి చేస్తున్నట్టుగా ఉండేది. ముఖ్యంగా సినిమా సంగీతం నించి నన్ను బయటకు లాగింది ఎల్.సుబ్రమణియం సంగీతమే. ఆ 'ఫ్యూజన్' కథ మరోసారి చెప్తాను. 

           ఐతే, సినిమాలు విపరీతంగా చూసే అలవాటుకొద్దీ అప్పుడే 'రుడాలి' చూడటం జరిగింది. అప్పటిదాకా (1993 వరకు) నాకు భూపేన్ హజారికా ఎవరో తెలీదు. కల్పన లజ్మీ ఎవరో తెలీదు. అసలు డింపుల్ కపాడియా సినిమాలు కూడా ఎక్కువ చూసినట్టు గుర్తులేదు. అప్పటికి బాలూమహేంద్ర, భారతీరాజా సినిమాలు చూసీ, చూసీ ఇళయరాజాను వినీ, వినీ మైమరిచిపోతుండగా ఉన్నట్టుండి 'రుడాలి' పెద్ద విస్ఫోటనంలా నిశ్శబ్దంగా మస్తిష్కంలో పేలింది.(
ఆ తరువాత అలాంటి పేలుళ్ళు చాలానే జరిగాయి).

           'రుడాలి'  చూసాకా, సినిమాలు ఇలా కూడా తీస్తారా? అన్నంత దిగ్భ్రమ కలిగింది...
           పాటలు ఇలా కూడా పాడతారా అని ఆశ్చర్యం వేసింది. 

           గబ్బర్ సింగ్ చచ్చిపోతే షోలేలో 'హమ్మయ్య' అనుకుని పండగ చేసుకుంటాం..కదా? ఇక్కడలా కుదరదు...అసలు అమ్జద్ ఖాన్ చనిపోయినప్పుడు 'సానిచెరీ' వొచ్చి గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంటే బిక్కచచ్చిపోయి తీరతాం. డింపుల్ తో పాటూ మనమూ ఏడ్చేస్తాం. ఎవరికోసం అనే అలోచనే రాదు. మనసంతా రాజస్తాన్ ఎడారిలా తయారవుతుంది. 

           ఇక సినిమా మొత్తం ఒక ఎత్తయితే, భూపేన్ హజారికా సంగీతం మరొక ఎత్తు. విచిత్రం ఏంటంటే, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఆడగొంతు కాకుండా భూపేన్ హజారికా పాట గుండెల్నిపిండెయ్యడం...! రోజుకి సుమారుగా 1,15,200 సార్లు లబ్ డబ్ మని అలసట లేకుండా కొట్టుకునే గుండె భూపేన్ హజారికా పాటతో బరువెక్కిపోతుంది. సినిమా అని తెలిసినా సరే, మన 'దిల్'... '
హూఁ...
హూఁ..మ్..మ్మ'ని బాధగా మూల్గుతూనే ఉంటుంది. దుఃఖం జీవనది లాంటిదని తెలుసుకు
నీ, దుఃఖ్ఖాన్ని ఓర్చుకోవడం నేర్చుకుంటుంది. ఏడవటమెలాగో, ఆ విద్య 'సానిచెరీ' కి ఎలా అబ్బిందో గమనిస్తుంది. 

           'రుడాలి'లో కళ్ళల్లో దుమ్ము కొట్టుకున్నట్టుగా  కనిపించే ఎడారితనాన్ని పట్టి, మనసుకు పరిచయం చేస్తుంది భూపేన్ హజారికా పాట. 

 వొదలకుండా నీడలా వెంటాడుతుంది. 

చేతనైతే మర్చిపొమ్మని పందెం కాస్తుంది.

...ఆ వెంటాడే పాటకి 
జై...!


భూపేన్ హజారికాకు నివాళి...!!



700 కోట్ల చిన్నారి నర్గీస్

Posted by చంద్రం on 11/03/2011 02:19:00 PM

           700 కోట్ల చిన్నారి నర్గీస్ కి ఎలా స్వాగతం చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తూనే ఉన్నా.

           ప్రతేకంగా ఏమీ తట్టలేదు. బహుశా ఇక కొత్తగా రాయడానికేముందీ...ఎలాగు భారతప్రభుత్వం ఏవో ప్రణాళికలు ప్రకటిస్తుంది కదా చూద్దాంలే అని అనుకుంటుండగా ఇవ్వాళ సాయంత్రం కనిపించిన ఈ దృశ్యం...  ...



ఫోటోలు : చంద్రం 

... ... మళ్లీ నన్ను ఆలోచింపచేసింది. 
           ఎలాగైతేనేం? 
పై ఫోటోలు కాకతాళీయమే ఐనా, ఈ సంధర్భంగా మళ్లీ ఒకసారి మనం  అనేకానేక జనాబా సమస్యలను పునరావలోకనం చేసుకునే అవకాశం వొచ్చిందనిపించింది.

           అన్నింటికన్నా ముఖ్యమేంటంటే, మిగతా విషయాల్లో సంగతి  ఎలా ఉన్నా 2030కల్లా జనాబాలో మనం చైనాని దాటిపోవటం ఖాయమని అధికారులు నమ్మకంగా హామీ ఇచ్చేసారు. సంపద సృష్టి, జనాబా సృష్టి ఈ లెఖ్ఖన వృద్ది చెందుతున్నా కూడా సగటు భారతీయుడి దినవారి తలసరి ఆదాయం 26 రూపాయలేనన్న చేదు నిజం మనం దేనిమీద దృష్టి సారించాలో స్పష్టంగానే చెప్తోంది. ఎయిడ్స్ పాతబడిపోయింది. ఇపుడు 'హంటా' గాలి వీస్తోంది.  రేపు మరిన్ని విన్నూత్న వైరస్ లు వొస్తాయి. కానీ దశాబ్దంగా మన ప్రభుత్వాలు  ఎయిడ్స్ ని ఎదుర్కోటున్న తీరు చూస్తే గుండెజారిపోక
 తప్పదు.

          ఆరోగ్యం ఇలా ఉంటే, విద్య, ఇతర మౌలికవసతుల కల్పన కూడా ఆశించిన మేరకు ముందుకు  సాగకపోవడానికి ఏ కారణాలు సమాధానం చెప్తాయి? ఏడెనిమిదేళ్ల క్రితం నేను ప్రభుత్వ విద్యాశాఖకి ఒక చిన్నపిల్లల పుస్తకం కోసం పని చేసే నిమిత్తం వెళ్లాను. అపుడు ఒక అధికారి అజీం ప్రేమ్
జీ ఫౌండేషన్ తయారు చేసిన పుస్తకం నాకు చూపించాడు. నిజానికి ఆ పుస్తకం ఎంతో నాణ్యంగా ఉంది. దాన్ని అజీం ప్రేమ్
జీ ఫౌండేషన్ ముద్రించి, ప్రభుత్వ విద్యాశాఖకి అందించింది. ప్రభుత్వ పనితీరు ఎన్నో రెట్లు మెరుగుపడితే తప్ప ప్రభుత్వం నించి  మనం అంతటి నాణ్యమైన పుస్తకాన్ని ఆశించలేం. కానీ ఆ పుస్తకం చేరాల్సిన చోటుకి చేరిందా? దాని ప్రయోజనం నెరవేరిందా? అన్నది అనుమానమే. తాజాగా అజీం ప్రేమ్
జీ ఫౌండేషన్ తరపున జిల్లాకి రెండు చొప్పున 1300 పాఠశాలలు కట్టించాలని నిర్ణయించుకోవడం ముదావహం. కానీ ఆ మరుసటి రోజే ఆయన కార్పోరేట్ సెక్టార్ కి ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం కరువైందని ఆగ్రహం వెళ్లగక్కడం గమనించదగ్గది. 'తాను పెట్టదూ...ఇంకొకర్ని పెట్టనివ్వదు'. చివరికి పూర్తిగా చేతులు కాలాకా, అన్నింటినీ ప్రైవేటైజ్ చేసినట్టుగానే విద్యను కూడా ప్రైవేటైజ్ చేస్తే తప్పా బాగుపడదని తేల్చేస్తారు.

           ఇలాంటిదే మరో సంగతి ఇప్పుడు అత్యంత విషమంగా మారిన రైతన్నల పరిస్థితి. పదేళ్ల క్రితం నేను ఒక ఆనిమేషన్ ప్రాజెక్ట్ కోసం అందుకున్న వీడియో చూస్తే ఇక రైతుల సమస్యలు ఎంతోకాలం ఉండవులే అనిపించింది. అది ITC కంపనీ డిజైన్ చేసిన ఈ-చౌపాల్ కాన్సెప్ట్ కి సంబందించిన వీడియో. అందులో రైతు పంట పండించే దగ్గరినించీ రిటైల్ మార్కెట్లో గిట్టుబాటు దరకు పంటనమ్ముకోవడం వరకూ చక్కగా ప్లాన్ చేసి, వివరించబడింది. కానీ పదేళ్ల తరువాత, ఇవ్వాళ...అందులో చూపించిన వాటిల్లో ఒక్క సూపర్ మార్కెట్ తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు. పైగా సునామీతో సమానంగా రైతులను బలి తీసుకుంటున్న విష
మపరిస్థితులు...! కారణాలు ఎవరైనా తేలిగ్గానే ఊహించుకోవచ్చు. కానీ, కారణాలేవైనప్పటికీ చిత్తశుద్ది ముఖ్యం కదా!

           లింగవివక్షతో బ్రూణహత్యలు పెరిగిపోయి, ప్రతీ వెయ్యిమంది మగవాళ్లకి 800మంది ఆడవాళ్లే మిగిలిన పరిస్థితుల్లో 7మిలియన్ కోట్ల మార్క్ దగ్గర 'నర్గీస్' పుట్టడం యదృచ్చికమే ఐనా అంతర్లీనంగా మనకు అందే సందేశం బ్రూణ హత్యలని అరికట్టాలనే.. సెకనుకొక్క కొత్త శిశువు పుడుతోన్న భారతదేశంలో ప్రభుత్వ పనితీరూ, వేగం ఎప్పుడూ నిరాశ కలిగించేదే కానీ ఇలాంటి కొన్ని విష
యాల్లో ప్రభుత్వంతో పాటూ ప్రజల స్వీయ సంస్కరణ, 
సంస్కారం కూడా అత్యంత ముఖ్యం. రోజు రోజుకీ అన్ని విషయాల్లో వెనక్కు వెళ్లుతోన్న మనం ఏ విషయాల్లో ముందడుగు వేస్తున్నామో ఆలోచించుకోవడానికి స్వాతంత్ర్యదినంలాగ ఒక రోజంటూ ఉండాలి కదా? ఆర్థిక వ్యవస్థలో, అధిక జనాభాలో అగ్రగామి చైనా తరువాత స్థానం మనదే ఐనా మానవాభివృద్ధిలో మనం ఇరాక్ కన్నా కిందకి జారిపోవడాన్ని ఎలా జీర్ణించుకోగలం? ఆరోగ్యం, విద్య, ప్రజల ఆదాయం ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో మనదేశం 134వ స్థానంలో ఉందన్న సంగతి ఇప్పుడు మన కళ్ళ ముందున్న కఠోర వాస్తవం.

           ఎంతమంది పుడుతున్నారన్నది ముఖ్యమే, కానీ ఎంతమంది 
అకాలంగా, అసహజంగా చనిపోతున్నారన్నది అంతకన్నా ముఖ్యమే కదా?

           ఇవ్వాళ ఉన్నట్టుండి అకస్మాత్తుగా మనమంతా బట్టలు చించుకుని, గగ్గోలు పెడుతున్న లోక్ పాల్ బిల్లు నిజానికి పార్లమెంట్ ముందుకు ఇలా రావడం ఇది పదోసారి అనీ, మొదటిసారిగా ఇందిరా గాంధీ ప్రభుత్వం కోసం, ఇప్పుడు 'జనలోక్ పాల్' బిల్లును రూపొందించిన  వ్యక్తే అప్పటి లోక్ పాల్ ముసాయిదాను తయారుచేసాడన్న నిజం ఎంత మందికి తెలుసూ?

           130 కోట్ల జనాబాకీ, వాళ్ల సంక్షేమానికీ సరిపడా ప్రణాళికలు సిద్దం చేసుకోవడానికీ, 
వాటిని అమలుచేయడానికీ ఈ లెఖ్ఖన మనకెంత కాలం పడుతుందీ?
                                                                                                                                                       
                                                                                                                                                      -చంద్రం